Thursday, March 7, 2013

ఓం మహాతపసే నమః | ॐ महातपसे नमः | OM Mahātapase namaḥ


Mahātapāḥ
మహత్తత్సృజ్యవిషయం తపో జ్ఞానం హి యస్య సః ।
ఉతైశ్వర్యం ప్రతోపో వా తపో యస్య మహచ్చ సః ॥


జ్ఞానమయమూ, సృజింపబడు విశ్వములు విషయములుగా గలదియూ అగు మహా తపస్సు ఎవనికి కలదో అట్టివాడు. లేదా తపము అనగా ఐశ్వర్యము అని అర్థము. గొప్పదియగు ఐశ్వర్యము ఎవనికి కలదో అట్టివాడు. లేదా తపః అనగా ప్రతాపము. గొప్పదియగు ప్రతాపము ఎవనికి కలదో అట్టివాడు మహాతపాః.

:: ముణ్డకోపనిషత్ - ప్రథమ ముణ్డకే, ప్రథమః ఖండః ::
య సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః ।
తస్మాదే త ద్బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే ॥ 9 ॥


స్వీయ సంకల్పమే జ్ఞాన స్వరూపమైనది కావున, ఎవడు సమస్త జగత్తుయొక్క ప్రవర్తనను తెలిసికొనుచు, ప్రతిచోట ప్రతి క్షణము జరుగుచున్న ప్రతి విషయమును గ్రహించుచున్నాడో, అట్టి పరమాత్మ నుండి, ఈ సృష్టికర్తయగు బ్రహ్మయు, ఈ నామరూపాత్మకమగు విశ్వము, అన్నాది ఆహారములు మున్నగునవి అన్నియు ఉద్భవించినవి.

No comments:

Post a Comment