 
             
హైదరాబాద్:
 అవును... నాని వయసు అంతే మరి. అలా అని నిజమైన వయసు అనుకోవద్దండి బాబూ. 
తెరపై ఆయన పోషిస్తున్న పాత్ర వయసే 45 యేళ్ళు. ఆయన కథానాయకుడిగా "జెండా పై 
కపిరాజు" అనే చిత్రం తెరకెక్కుతోంది. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. 
అమలా పాల్ కథానాయిక.
ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం 
పోషిస్తున్నారు. ఒక పాత్రలో 27 ఏళ్ళ యువకుడిగా, మరో పాత్రలో 45 ఏళ్ళ 
వ్యక్తిగా నటిస్తున్నట్టు సమాచారం. వయసు ఎక్కువున్న పాత్రలో నాని ప్రతి 
నాయకుడిగా కనిపిస్తాడట. తాజాగా తెలిసిన మరో విషయం ఏమిటంటే... ఆ పాత్ర కోసం 
నాని గుండు కూడా కొట్టిస్తున్నాడని సమాచారం. 
ప్రస్తుత సమాజాన్ని ప్రతిభింబించే కథతో ఈ
 చిత్రం తెరకేక్కుతున్నట్టు తెలుస్తోంది. మనపై మనం పోరాటం చేసుకున్నప్పుడే 
సమాజం బాగు పడుతుందని చెప్పే కథ ఇది. మరి గుండుతో కనిపించే నాని గజినిలో 
సూర్య శైలిలో కనిపిస్తాడా? లేక వేరే రకంగా కనిపిస్తాడా? అన్నది తేలాల్సి 
ఉంది.
No comments:
Post a Comment