 
             
హైదరాబాద్:
 రెబెల్ స్టార్ కృష్ణంరాజు మెగా ఫోన్ చేత పట్టి ఓ చిత్రాన్ని 
రూపొందిస్తున్నారనే ప్రచారం చిత్ర పరిశ్రమలో చాలా రోజులుగానే సాగుతోంది. 
అందుకోసం కథ కూడా సిద్ధం అయ్యిందని ఆ మధ్య స్వయంగా చెప్పారు కృష్ణంరాజు. 
అయితే ఆ సినిమా ఎవరితో ఉంటుంది? ఎప్పుడు? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం 
దాటవేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆ సినిమాకోసం కసరత్తులు ఊపందుకున్నాయి. 
ఇటీవలే "ఒక్క అడుగు" అనే పేరును 
కృష్ణంరాజు తన గోపి కృష్ణ బ్యానర్ పై రిజిస్టర్ చేయించారు. అది ప్రభాస్ 
కథానాయకుడిగా నటించిన "ఛత్రపతి" సినిమాలో డైలాగ్ కావడంతో ఆ పేరుతో ప్రభాస్ 
సినిమా ఉంటుందని ఓహించారు. అయితే ఆ పేరుతొ  కృష్ణంరాజు సినిమా 
తీయబోతున్నట్టు సమాచారం. తను తయారు చేసుకున్న కథకు తగ్గట్టుగానే ఆ పేరును 
రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. 
అయితే ఆ సినిమాలో ఎవరు కథానాయకుడు అనే 
విషయం మాత్రం బయటకు రావడం లేదు. ప్రభాస్ ఇంకో రెండేళ్ళ వరకు ఇతర ఏ సినిమా 
చేసే పరిస్తుతులు లేవు. దీన్నిబట్టి వేరొక కథానాయకుడితోనే కృష్ణంరాజు 
సినిమా ఉంటుందని ఫిలింనగర్ భావిస్తోంది. ఈ విషయంపై కృష్ణం రాజు మాట్లాడుతూ 
 నటీనటుల గురించి ఇంకా ఏదీ నిర్ణయం తీసుకోలేదు అన్నారు.
No comments:
Post a Comment