వీలైనంత త్వరగా బ్లాక్ మనీని భారత్ కు తెచ్చేందుకు కృషి చేయాలని లేకపోతే తరలివెళ్తున్న నల్లధనం లెక్కలు వేసుకోవడానికి మన కంప్యూటర్లు కూడా సరిపోవంటున్నారు.
అందుకే అవినీతి అక్రమాల యూపీఏ శకం అంతరించి కొలువుదీరిన మోడీ సర్కార్ సిట్ ఏర్పాటుకు సై అనడంతో నల్ల ధనాన్ని దేశానికి తిరిగి తెచ్చే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని దేశ ప్రజ ఎదురుచూస్తోంది.
ప్రచారంలో ఉన్నట్లు 84 లక్షల కోట్ల రూపాయలు కాకపోయినా కనీసం యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన 23 వేల కోట్ల రూపాయలనైనా తీసుకురాగలిగితే దేశ భవిష్యత్తే మారిపోతుందన్నది తిరుగులేని నిజం.
వచ్చే ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఎన్ని కష్టాలకోర్చి అయినా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దుమ్ముదులిపి దేశానికి తీసుకురాగలిగితే మోడీ దేశ చరిత్రలో తిరుగులేని నేతగా మిగిలిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
No comments:
Post a Comment