Friday, July 18, 2014

6కోట్లకు సీడెడ్ హక్కులు for ''రుద్రమదేవి ''


అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ''రుద్రమదేవి '' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సీడెడ్ డిస్ట్రిబ్యుటర్ ఎన్వీ ప్రసాద్ 6కోట్లకు సీడెడ్ హక్కులను పొందాడు. ఇంతపెద్ద మొత్తాన్ని చెల్లించడానికి కారణం ఈ చిత్రంలో గోనగన్నారెడ్డి గా అల్లు అర్జున్ నటిస్తుండటం . ఇటీవలే రేసుగుర్రం చిత్రంతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన బన్నీ రుద్రమదేవి చిత్రంలో గోనగన్నారెడ్డి గా నటిస్తుండటం తో మరింత క్రేజ్ వచ్చింది ఈ చిత్రానికి . ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. బన్నీ గోనగన్నారెడ్డి గా నటిస్తుండగా అతడి సరసన కేథరిన్ నటిస్తోంది. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇంకా ఈ చిత్రంలో రానా ,కృష్ణంరాజు ,సుమన్ ,నిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. 

No comments:

Post a Comment