నిన్న
జరిగిన భాజపా జాతీయ మండలి సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి
ఇచ్చిన ప్రసంగం అందరిని ఎంతో ఆకర్షించింది. కేవలం పేపరులో రాసుకున్నది
చదవడం, ఎదో మాట్లాడాలి కాబాట్టి ఎదోకటి
చెప్పేయడం ఆయనకు అలవాటు లేదు. ఆయన ప్రసంగాలలో ఎంతో స్పష్టత ఉంటుంది.దేశంలో
సమస్యలు, వాటికి పరిష్కారాలు, మరియు దేశ అభివృద్ధి, భద్రత గురించి ఆయన
ప్రసంగించే విధానం అందరిని ఆకట్టుకుంటుంది. ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా,
ప్రసంగాలు ఇచ్చినా "భారత్ మాతా కి జై" అనే నినాదంతో మొదలుపెట్టడం ఆయన
ప్రత్యేకత.
నిన్న ఆయన ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని మాటలు:
1) భారతీయ జనతా పార్టీ ఒక "మిషన్" కోసం పనిచేస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం "కమీషన్" కోసం పనిచేస్తుంది.
2) కాంగ్రెస్ పార్టీని ఓడించి, కాంగ్రెస్స్ పార్టీ నుంచి దేశానికి విముక్తి కలిగించడమే నిజమైన దేశభక్తి.
3) బ్రిటీషు వారిని తరిమికొడితే మనకు స్వరాజ్యం వచ్చింది, అలాగే కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తే మన దేశంలో సురాజ్యం వస్తుంది.
4)ఒక కుటుంబం కోసం దేశాన్ని బలిచేయడం కాంగ్రెస్ పార్టీ కి అలవాటు
అయిపోయింది. ఆ కుటుంబం కోసం దేశ హితాన్ని, తమ పార్టీ విలువలను కూడా త్యాగం
చేస్తారు.
5)ఆ కుటుంబం ఏది చెబితే అదే చేసే వ్యక్తిని ప్రధాన
మంత్రిగా చేశారు. నైట్ వాచ్ మ్యాన్ గా చేశారు. దేశాన్ని ముందుకు
తీసుకువెళ్ళాలి అనే సంకల్పం కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే లేదు. శతబ్దాల
పాటు సర్వహక్కులు కాంగ్రెస్ చేతులోనే ఉన్నాయి. ఎన్ని ఉన్నా కాంగ్రెస్
దేశాన్ని వెనక్కి తీసుకువెళ్ళింది తప్ప ముందుకుతీసుకువెళ్ళలేదు.
6)మనకు ఎన్నో వనరులు, అవకాశాలు ఉన్నా, మనది పెద్ద దేశం అయినా కూడా కాంగ్రెస్ వలన మన దేశం వెనకబడిపోయింది.
7) ప్రతి భారత పౌరుడిలో దేశభక్తిని నింపాలి. అప్పుడే స్వామీ వివేకానంద కలగన్నట్లు భారత దేశం విశ్వ గురు అవుతుంది.
8) కాంగ్రెస్ దేశానికి పట్టిన చెద పురుగు! దేశాన్ని మొత్తం తినేస్తుంది.
హెలికాప్టర్ కుంభకోణం, 2జి కుంభకోణం ఇలా వీటిలో వచ్చిన కమీషన్ బావకు ఇంత,
మామ కు ఇంత, తండ్రికి ఇంత అన్నట్లు సాగుతుంది.
9)భారత దేశం మొత్తం కాంగ్రెస్ నుండి విముక్తి కోరుకుంటుంది. మన కర్తవ్యం కమలాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళడమే !
10) భాజపా పనితీరును ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తున్నాయి. ఇప్పుడు జరిగే సమావేశం గురించిన సమాచారం కూడా ప్రపంచదేశాలకు అందుతుంది.
-నరేంద్ర మోడి (జాతీయ మండలి సమావేశం)
No comments:
Post a Comment