 
             
హైదరాబాద్: మహేష్ బాబు,
 సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా విడుదల ఖరారైనట్లు కనిపిస్తుంది. 
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మహేష్ బాబు పుట్టిన 
రోజునే విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్ 9 న మహేష్ పుట్టిన రోజు 
కావడంతో ఆ రోజే సినిమాను కూడా విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం దాదాపుగా అరవై శాతం వరకు 
షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను ఆగస్ట్ లో అయితే ప్రస్తుతం విడుదలకు సిద్దంగా 
ఉన్న అన్ని సినిమాలు వాటి పని అవి చేసుకుని వెళ్ళిపోతాయి. అప్పుడు మహేష్ 
సినిమాను పుట్టిన రోజున అభిమానులకు గిఫ్ట్ గా రిలీజ్ చేయాలని 
భావిస్తున్నారు. మిగిలిన షూటింగ్ కోసం ఈ యూనిట్ కూడా లండన్ వెళ్లనుంది.
గతంలో ఆగస్ట్ 10న 'అతడు' సినిమా విడుదలై
 హిట్ కొట్టడం కూడా ఈ సినిమా విడుదలకు మరో కారణంగా తెలుస్తుంది. ఈ సినిమాలో
 మహేష్ కు జోడిగా ప్రముఖ మోడల్ కృతి సనాన్ నటిస్తుంది. 14 రీల్స్ ఎంటర్ 
టైన్మెంట్ పతాకంపై వస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలిస్తుండగా 
పేరును ఇంకా ఖరారు చేయలేదు. 
 
No comments:
Post a Comment