 
             
ముంబై:
 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ లో అడుగు పెట్టిన మొదటి సినిమా 
జంజీర్ రకరకాల బ్రేక్ పడుతున్నా అన్నింటిని అధిగమించి త్వర త్వరగా 
చిత్రీకరణ జరుగుతుంది. తెలుగు, హిందీలో రెండు బాషలలో ఒకే సారి చిత్రీకరణ 
జరుగుతూ, ఒకేసారి విడుదల చేయాలని బావిస్తున్న ఈ  సినిమాలో ఒక ఐటెం సాంగ్ 
ఉంది.
ఈ ఐటెం సాంగ్ కు బుల్లితెర హాట్ లేడీగా 
పేరు తెచ్చుకున్న కవితా కౌశక్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. పరిశోధక
 సీరియల్ 'ఎఫ్ఐఆర్' లో పోలీస్ ఆఫీసరుగా నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ హాట్
 అందాలతో వెండి తెరపై మేరవనుంది. కవిత చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్ర 
ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ రావడంతో ఇప్పుడు ఈ అవకాశాన్ని దక్కించుకుంది.
మొత్తానికి ఇలా జంజీర్ లోని 'షకీలా బనో'
 అనే ఐటెం మసాలా సాంగ్ లో చెర్రీతో కలిసి చిందులేయనుంది. రాకరాక వచ్చిన ఈ 
అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని కవిత కాస్త మోతాదుకు మించిన 
మసాలనే దట్టించిందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 
 
No comments:
Post a Comment