హైదరాబాద్:
శేఖర్ కమ్ముల స్కూల్ నుండి వచ్చి స్టార్ గా ఎదిగిన హీరో వరుణ్ సందేశ్
ఇప్పుడు ఏకంగా అరడజను సినిమాలకు పైనే సినిమాలను చేస్తూ బిజీ బిజీగా ఉనాడు.
అయితే రెమ్యునరేషన్ కూడా బాగానే డిమాండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం వరుణ్
సినిమాల్లో 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' సినిమా విడుదలకు ఉండగా ప్రియతమా
'నీవచట కుశలమా', 'నువ్విలా నేనిలా', 'ఈ వర్షం సాక్షిగా' సినిమాలు సెట్స్
పైన ఉన్నాయి.
మొన్న షూటింగ్ ప్రారంభించిన 'ఈ వర్షం
సాక్షిగా' సినిమాకు గాను 50 లక్షలకు పైగా డిమాండ్ చేసినట్లు టాలీవుడ్ లో
వినిపిస్తుంది. నిర్మాతలు కూడా దీనికి అంగీకరించి అడిగినంత
ముట్టజెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు గాను 40 రోజులు మాత్రమే డేట్స్
ఇచ్చినా రెమ్యునరేషన్ మాత్రం డిమాండ్ చేసి మరీ తీసుకున్నాడట.
వరుణ్ మొత్తానికి టాలీవుడ్ లో బాగానే
క్లిక్ అయ్యాడు. తనతో శేఖర్ స్కూల్ నుండి వచ్చిన వారు పుష్కరానికి ఒక
సినిమా చేస్తుంటే వరుణ్ మాత్రం డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకుంటూ వరుస
సినిమాలతో దూసుకుపోవడం అదృష్టం కాక మరేంటి..!
No comments:
Post a Comment