Thursday, February 28, 2013

కృష్ణంరాజు దర్శకత్వం కోసమే ఆ టైటిల్!


హైదరాబాద్: రెబెల్ స్టార్ కృష్ణంరాజు మెగా ఫోన్ చేత పట్టి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారనే ప్రచారం చిత్ర పరిశ్రమలో చాలా రోజులుగానే సాగుతోంది. అందుకోసం కథ కూడా సిద్ధం అయ్యిందని ఆ మధ్య స్వయంగా చెప్పారు కృష్ణంరాజు. అయితే ఆ సినిమా ఎవరితో ఉంటుంది? ఎప్పుడు? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం దాటవేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆ సినిమాకోసం కసరత్తులు ఊపందుకున్నాయి. 
 
ఇటీవలే "ఒక్క అడుగు" అనే పేరును కృష్ణంరాజు తన గోపి కృష్ణ బ్యానర్ పై రిజిస్టర్ చేయించారు. అది ప్రభాస్ కథానాయకుడిగా నటించిన "ఛత్రపతి" సినిమాలో డైలాగ్ కావడంతో ఆ పేరుతో ప్రభాస్ సినిమా ఉంటుందని ఓహించారు. అయితే ఆ పేరుతొ  కృష్ణంరాజు సినిమా తీయబోతున్నట్టు సమాచారం. తను తయారు చేసుకున్న కథకు తగ్గట్టుగానే ఆ పేరును రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. 
 
అయితే ఆ సినిమాలో ఎవరు కథానాయకుడు అనే విషయం మాత్రం బయటకు రావడం లేదు. ప్రభాస్ ఇంకో రెండేళ్ళ వరకు ఇతర ఏ సినిమా చేసే పరిస్తుతులు లేవు. దీన్నిబట్టి వేరొక కథానాయకుడితోనే కృష్ణంరాజు సినిమా ఉంటుందని ఫిలింనగర్ భావిస్తోంది. ఈ విషయంపై కృష్ణం రాజు మాట్లాడుతూ  నటీనటుల గురించి ఇంకా ఏదీ నిర్ణయం తీసుకోలేదు అన్నారు.

No comments:

Post a Comment