Thursday, March 14, 2013

EVER GREEN SONG OF PAWAN

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం
దీపాన్ని చూపెడుతుందొ తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం

చరణం1:

ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండె బావిలో వున్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
ఎదను వుంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం

చరణం2:

సుర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకుని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఏదెమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం
దీపాన్ని చూపెడుతుందొ తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

No comments:

Post a Comment