 \
\
కమల్
 స్టామినా ఏంటో రుజువయింది. ఒక దర్శకుడిగా, నటుడిగా తన ప్రత్యేకతను కమల్ 
మరోసారి రుజువుచేసుకున్నాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నింటినీ అధిగమించి 
విశ్వరూపం విడుదల చేశారు. ఇప్పటివరకూ విశ్వరూపం సుమారు 120 కోట్ల రూపాయలు 
వసూలు చేసిందట. ఈ సంతోషాన్ని సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లో పంచుకున్నాడు
 ఇందులోని మరో ప్రధాన పాత్రధారి రాహుల్ బోస్. 
‘విశ్వరూపం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు 100
 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఉన్న సినిమాలో నేను నటించడం ఇదే మొదటిసారి. ఈ 
చిత్రం ఇప్పటివరకూ సుమారు 120 కోట్లు వసూలు చేసిందని తెలిసింది. చాలా చాలా 
సంతోషంగా ఉంది. కమల్ సహా మిగతా టీమ్ అందరికీ నా అభినందనలు’ అని సంతోషంగా 
చెప్పాడు రాహుల్ బోస్. 
 
No comments:
Post a Comment