ఎందుకు మనసా నన్ను మాయచేశావు (My Hart Beat )
నిన్ను శుభోదయం అని పలకరించే పదిమంది లో నేనూఒకన్ని కావడం నాకిష్టంలేదు
 అందుకే భానుని లేత తొలి కిరణం లా మారి నిన్ను ప్రత్యేకంగా చేరాలనుకుంటున్నాను
 
 వేల నక్షత్రాలలో ఒకటిగా చేరి నీ నిశిరాత్రి ని నింపడం నాకు నచ్చలేదు
 అందుకే నీ మనసులో వెన్నెల వెలుగు లా కురవాలనుకుంటున్నాను
 
 సమస్యలసంద్రంలో నువ్వు ఉన్న సమయాన నిన్ను ఒడ్డుకునెట్టే వంద అలల్లో ఒకటి కావడం నా అభిమతం కాదు
 అందుకే నా ప్రేమనావ లో నిన్ను తీరాన్ని చేర్చాలని తపన పడుతున్నాను
 
 నిన్ను ఆహ్లాదపరిచే వేల వర్ణాల్లో ఒకటి కావడం నా కోరిక కాదు
 అందుకే నీ మనసు కాన్వాస్ పై చిత్రమైన వర్ణాల చిత్ర పటమై నిలవాలనుకుంటున్నాను
 
 నువ్వు చూసే వేల రూపాల్లో నాది ఒకటి కావడం నాకు తృప్తి నివ్వదు
 అందుకే అద్దం లో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ ప్రతిబింబం నేనవ్వాలనుకుంటున్నాను
 
 నేను నీకెంత ప్రత్యేకతనిస్తానో
 నీక్కూడా నేనంత ప్రత్యేకం కావాలనుకుంటున్నాను
 
 ఈ భావాలకి నువ్వు పెట్టే పేరు అసూయ అయినా ఆనందమే.....
 నా అభిమానానికి నువ్విచ్చే బిరుదు స్వార్ధమైనా సంతోషమే.................!
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment