Tuesday, February 12, 2013

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

ప్రస్తుత రోజులలో ఒత్తిడి ప్రతి ఒక్కరిని అలసిపోయేలా చేస్తోంది. ఎన్ని ఆహారాలు తీసుకొన్నప్పటికీ ఒత్తిడి కారణంగా అవన్నీ మనలను నీరసించేలానే చేస్తూంటాయి. ప్రత్యేకించి చాలామంది ఉదయంనుండి సాయంత్రం వరకు ఆఫీసుల్లో పనిచేసి అలసిపోతూంటారు. ఉదయం 11 గంటలకు ఒక కాఫీ లేదా సాయంత్రం 4 గంటలకు ఒక ‘టీ' వంటివి ఎప్పటికపుడు శక్తి పొందేందుకు తాగి పని చేస్తూంటారు. కాఫీలు, టీల వంటివి తాత్కాలికంగా మనలోని శక్తిని పెంచి పని చేసేలా చేసినప్పటికి, వాటి ప్రభావంగా మరల సాయంత్రం అయ్యే సరికి అలసిపోక తప్పదు. అందుకు ప్రత్యామ్నాయంగా పండ్ల రసాలను తీసుకోవడం చాలా మంచిది. పండ్ల రసాల వలన ప్రయోజనాలు అనేకం. సాధారణంగా సెలిబ్రిటీలు, మోడల్స్, సైజ్ జీరో అవ్వాలనుకునేవారంతా పండ్లు, కూరల రసాలు ఆహారం బదులుగా 4 లేదా 5 వారాలపాటు తాగి బరువు తగ్గించేసుకుంటారు. కొంతమందికి 4 మరికొంతమంది 5 లేదా 6 కిలోల బరువు కూడా తగ్గిపోతూంటుంది. రసాల ఆహారం మీ జీర్ణ వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలినాలు వెలికి తీస్తుంది. చర్మం మెరిసేలా, తల వెంట్రుకలు బలపడేలా చేస్తుంది. పండ్లలో చాలా వాటికి మంచి పోషకాలుంటాయి. అంతేకాదు, తాజా పండ్ల రసాలను శరీరం అతి త్వరగా పీల్చేసుకుని జీర్ణ చేసుకుంటుంది. రోజువారీ జీవితంలోఎవరెంత బిజీ షెడ్యూలు కలిగి వున్నా తప్పకుండా ఒక్క గ్లాసెడు పండ్ల రసం శరీరానికి మేలు చేస్తుందనేది గ్రహించి తాగుతూండాలి. ఏ కాలంలో దొరికే ఆ పళ్ళు(సీజనల్ పండ్లు), ఆ కాలంలో తినాలి. అందువల్ల అప్పుడప్పుడు వచ్చే శారీరక వ్యాధులు నయం అవుతాయి. అంతేకాకుండా పళ్ళు, పళ్ళరసాలు వల్ల అనేక ఉపయోగాలున్నాయి. అవి ఏమిటంటే. ఫలాలు ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యవరాలు, ఇవి సహజమైన మందులు. వీటలో ఎన్నో ఔషథగుణాలు న్నాయి. మందుల కన్నావీటి ఖర్చుతక్కువ. బిట్టర్‌ పిల్స్‌ కన్నా, స్వీట్‌ ఫ్రూట్‌ జ్యూసులతో అనేక రోగాల్ని సరిచేస్తాయి. వండిన ఆహారంలో ఎన్నో పోషకవిలువలు నశిస్తాయి. పళ్ళు అన్ని రకాల పోషకవిలువలు కల్గి ఉంటాయి. పళ్ళల్లో ఉన్న పోషకాలు సులువుగా శరీరంలోకి గ్రహించబడతాయి. శరీర ఆరోగ్యం కోసం అన్ని పళ్ళు తినవచ్చు. ప్రత్యేక వ్యాధుల నిర్మూలనకు కొన్ని నియమిత ఫలాలు అవసరమవు తాయి. ఉదయం పూటమాత్రమే తీసుకోవాలని వైద్య సలహా. లివర్‌, కిడ్నీల వ్యాధులు, క్యాన్సర్‌, గేట్‌, ఆర్థ్రరైటీస్‌ వంటి వ్యాధులు కూడా జ్యూసెస్‌తో నయమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎర్ర రక్తకణాలను వృద్ధి చేయడానికి ఎన్నో జ్యూసెస్‌ అత్యుత్తమ ఫలితాలని స్తున్నాయి. ఒకటి, రెండు ఫలాలు అప్పుడప్పుడు తినడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు. సమృద్ధిగా నిరంతరం తింటేనే ఆయా ఫలితాలు పొందవచ్చు.

No comments:

Post a Comment