హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మిర్చి' చిత్రం ఫస్ట్
వీకెండ్ ముగిసే సరికి యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలనే రాబట్టింది.
అంతే కాకుండా దీనికంటే ముందు యూఎస్‌లో విడుదలైన ‘నాయక్' చిత్రానికంటే
మెరుగైన వసూళ్లు రాబట్టింది. నాయక్ చిత్రం ఆరు రోజులతో కూడిన ఫస్ట్ వీకెండ్
కలెక్షన్లను...మిర్చి చిత్రం కేవలం మూడు రోజుల్లోనే దాదాపుగా
అధిగమించింది.
నాయక్ చిత్రం అమెరికాలో జనవరి 8న 52 స్ర్రీన్లలో విడుదలై ఎక్సలెంట్
రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి 6 రోజులు కలిసి
రావడంతో యూఎస్‌లో రూ. 2.11 కోట్లు($ 387,808) నెట్ వసూలు చేసింది. మంగళవారం
$ 62,742, బుధవారం $ 80,375, గురువారం $ 24,867, శుక్రవారం $ 73,533,
శనివారం $ 94074, ఆదివరాం $ 52,217 రాబట్టింది.
prabhas mirchi beats naayak collection record at box
మిర్చి | నాయక్
76 స్క్రీన్లలో ఫిబ్రవరి 7న అమెరికాలో విడుదలైన మిర్చి చిత్రం...ఇప్పటికే
స్ర్కీన్ పరంగా SVSC(69 స్క్రీన్లు), నాయక్(52 స్క్రీన్లు)లను బీట్ చేసిన
సంగతి తెలిసిందే. తాజాగా ‘మిర్చి' చిత్రం రికార్డు బ్రేకిగ్ ఓపెనింగ్స్‌తో
ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
‘మిర్చి' చిత్రం తొలి మూడు రోజుల్లో యుఎస్‌లో రూ. 2.08 కోట్లు వసూలు
చేసింది. గురువారం $ 94,144, శుక్రవారం $ 116,040, శనివారం $ 178,864 వసూలు
చేసింది. ఆదివారం కలెక్షన్స్ మరింత మెరుగ్గా ఉంటాయని, ఈ టోటల్ కలిపితే
ఫస్ట్ వీకెండ్ వసూళ్లు భారీ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
No comments:
Post a Comment