హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హాట్ హీరోయిన్ సమంత 
తొలిసారిగా జతకడుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం 
వహిస్తున్న ఈచిత్రం షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లోని సిటీ సెంటర్లో జరిగింది. 
ఇక్కడ సమంత, పవన్ కళ్యాణ్ పై పలు సీన్లు చిత్రీకరించారు. సమంతను కొందరు 
ఆకతాయిలు అల్లరి పెడుతుంటే వారి నుంచి సమంతను పవన్ కళ్యాన్ కాపాడతాడు. ఫైట్
 మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ సీన్ చిత్రీకరణ సాగింది.
మరో హీరోయిన్ ప్రణీత ఈచిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. బివిఎస్ఎన్ 
ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం 
అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈచిత్రానికి ‘తుఫాన్' అనే టైటిల్ 
పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా దీన్ని అధికారికంగా ఖరారు చేయలేదు.
పూర్తిగా కమర్షియల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రం పవన్ కళ్యాన్ అభిమానులు
 కోరుకునే అన్ని అంశాలతో వినోదాత్మకంగా రూపొందుతోంది. ముఖ్యంగా త్రివిక్రమ్
 శ్రీనివాస్ పంచ్ డైలాగులు, స్క్రీన్ ప్లే సినిమాకు హైలెట్ కానుంది. గతంలో 
వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి 
తెలిసిందే.

 
No comments:
Post a Comment