small .....
ఎక్కడో ఏదో జరుగుతుంది
 గాలి చొరబడని మనిషి కనబడని
 కీకారణ్యం..ఒక్కడినే ఉన్నా
 చుట్టూ మనుషులున్నారు
 ఏంటో ఒక్కల్లకు హృదయం లేదు
 డబ్బాల్లా తిరుగుతున్నారు
 హృదయం ప్లేస్ లో మాత్రం
 ఓ ప్లాష్టిక్ కాలీ డబ్బా ఉందెంటో
 
 నాచుట్టు నీజ్ఞాపకాలను పర్చుకొన్నా
 వాటి వెలుగుల్లోనే బ్రతుకునీడుస్తున్నా
 బ్రతకాలన్న ఆశతోకాదు
 ఎప్పటిదాకా బ్రతుకుతానోతెలీక
 
 చుట్టూ స్మశానం బ్రతికామన్న ద్యాసే లెదెందుకో
 చుట్టూ సమాదులే ..అదే కదా చివరి మజిలీ
 అందుకే అక్కడేమన్నా నిజాలు
 తెలుస్తాయేమో అని దేవుతున్నా
 ఎందుకోతెల్సా..నీవే ఇలా చేస్తే
 అందరూ ఎందుకలా ఉంటారో అని
 
 నాశరీరాన్ని ఎండబెట్టి ఆరబెడుతున్నా
 మార్పు నాలోరావాలేమో అని
 నన్ను నేను మార్చుకోవాలని
 ఇంకా ఏమన్నామార్పువస్తుందేమోఅని
 నిన్ను ఏం అడగలేను అడిగినా చెప్పే పరిస్థితిల్లో లేవు
 
 నేను అందరూ నా వాళ్ళని ఆరాటపడితివే
 నాది ఆవేదనగా మిగిలి పోయింది
 ఇక్కడ నాచుట్టూ ఉన్న శవాలతో సహవాసమే
 ఇదే బాగుంది..అవే కాస్త అర్దం చేసుకున్నాయి
 చివరకు నా ఆకరిస్థానంలో ఏన్నో నిజాలు దాగున్నాయని
 
 నాచుట్టూ ఎందరి జ్ఞాపలానున్నా
 అంతలా వెలుగునిస్తున్నవి నీజ్ఞాపకాలే
 ఆవెలుగుల్లో ఈ జీవితాన్నిబ్రతికేయొచ్చేమో ప్రియా
 
 ఇంతా వెతుకుతున్నా అసలు నిజాలను చేదిస్తానోలేదు
 అందుకే వెతుకుతూనే ఉన్నా ..
 వెతుకుతూనేఉంటా చివరి వరకు ప్రియా
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment