ప్రభాస్ ని ఎలా ఎత్తుకున్నానంటే?
హైదరాబాద్: ఆరున్నర అడుగుల కుర్రాడు ప్రభాస్. అయన కట్ ఔట్ చూస్తేనే విలన్లు భయపడిపోతారు. కటౌట్ చూపించేసి నిర్మాతలకు ఫైట్ ఖర్చు కూడా లేకుండా డబ్బులు మిగిలించేస్తాడు. "మిర్చి" చిత్రంలో అదే చేశాడు. కటౌట్ ని చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డ్యూడ్... అంటూ మాటలతో ఫైట్ చేసేశాడు.
అయితే ఆ సినిమాలో ప్రభాస్ ని అనుష్క
అవలీలగా ఎత్తుకుంది. చెట్టుపై మామిడిపండ్లు కోయించింది.అంత భారీ కటౌట్ ని
ఎలా ఎత్తుకున్నవమ్మా జేజమ్మా... అని అనుష్కనే అడిగితె... ఆ సన్నివేశం
గురించి ఇలా చెప్పుకొచ్చింది. "ప్రభాస్ ని ఎత్తుకున్న విధానం సినిమాలో చూసి
ప్రభాస్ అమ్మగారు కూడా ఇదే ప్రశ్న నన్ను అడిగారు. తను నిజంగా చాలా బరువుగా
ఉంటాడు.
తనని మొదట స్టూల్ పైన నిలుచోబెట్టి
నన్ను ఎత్తుకోమన్నారు. అప్పుడు కింద స్టూల్ తీసేసి షాట్లు తీసేశారు. ఆ
సన్నివేశం చేయడం సరదాగా అనిపించింది. ప్రభాస్ ని ఎత్తుకున్నాక సెట్లో అందరూ
నన్ను అభినందించారు. అనుష్కకి చాలా బలం ఉందని అనుకోనుంటారు" అంటూ కిల కిల
నవ్వింది స్వీటీ. ప్రభాస్ చాల మంచివాడు, తనతో మరిన్ని సినిమాలు చేయాలనుంది
అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
No comments:
Post a Comment