 
             
హైదరాబాద్:
 భారి బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి చిత్రానికి 
నటీ నటుల ఎంపిక  ఒక సెన్సేషనల్ మారి భారీ మల్టీ స్టారర్ అయ్యింది. భారతీయ 
జానపద కథాంశం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో 'అనగనగా ఒక ధీరుడు' 
సినిమాలో రాకుమారి తరహా పాత్రలో మెప్పించిన శృతి హసన్ కూడా ఎంపిక అయిందని 
టాలీవుడ్ లో వినిపిస్తుంది. 
ఇప్పటికే ప్రభాస్, అనుష్క, రానాలతోపాటు 
నాగబాబు కూడా ఈ సినిమాలో నటిస్తుండగా ఇప్పుడు శృతి కూడా తోడవడంతో బాహుబలికి
 కొత్త కళ సంతరించుకోనుంది. దీనికి సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని 
టాక్ వినిపిస్తుంది. 
ప్రస్తుతం శృతి రవితేజ 'బలుపు' సినిమాతో
 పాటు ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఓ పాత్ర 
చేస్తుంది. రాజమౌళి కాస్టింగ్ విషయంలో కూడా ఎక్కడా రాజీపడకుండా మంచి 
నటీనటులను సెలెక్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సినిమాపై మరింత ఆసక్తి 
పెంచుతున్నారు.
 
No comments:
Post a Comment