నెల్లూరు:
 సూపర్ స్టార్ రజనీ కాంత్ కు సొత్ తో పాటు ప్రపంచమంతా అభిమానులున్నారు. 
అందుకే ఆయన కు ఓ క్రేజ్. రజనీ కూడా అభిమానుల ఆదరనే నాకు ముఖ్యం అని చాలా 
సార్లు చెప్తుంటారు. అంటే కాదు ఆయనకు తెలిసిన విదంగా అభిమానుల రుణం కూడా 
తీర్చుకుంటారు. అభిమానులు తమ కార్యక్రమాలకు రజనిని ఆహ్వానిస్తే తమకు వీలయిన
 రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తారు.
అయితే ఈ మద్య ఓ అభిమాని తన సోదరుడి 
పెళ్లికి ఈ రోబోను ఆహ్వానించాడు. ఈ పెళ్ళికి రజనీ  స్వయంగా వచ్చి అక్కడున్న
 వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీనికి నెల్లూరు వేదిక అయ్యింది. 
దంపతులను ఆశీర్వదించి తమ అభిమానులతో కాసేపు కబుర్లు చెప్పి అభిమానుల రుణం 
తీర్చుకున్నాడు. 
పెళ్ళికి రజనీ హాజరవడంతో అక్కడున్న 
జనానికి నోట మాట రాలేదు. దంపతులిద్దరూ సాక్షాత్తు ఆదేవుడే దిగి వచ్చినట్లు 
భావించారట. ఇది రజినీ అభిమానులకు ఇచ్చే గిఫ్ట్. అందుకేనేమో ఆయన అభిమానులు 
‘దటీజ్ అవర్ రజనీకాంత్’ అని అనేది.
 
No comments:
Post a Comment