కోల్‌కతా: ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టు మ్యాచులకు ఓపెనర్ గౌతం
గంభీర్‌ను జట్టు నుంచి తొలగించడాన్ని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్
సౌరవ్ గంగూలీ సమర్థించాడు. హర్భజన్ సింగ్‌కు చోటు కల్పించడం మంచి నిర్ణయమని
ఆయన అన్నాడు. గంభీర్ పరుగులు చేయడం లేదని, అందుకే అతన్ని జట్టు నుంచి
తొలగించారని, శిఖర్ ధావన్ పరుగులు చేస్తున్నాడని, పరుగులు చేస్తేనే జట్టులో
ఉంటారని గంగూలీ అన్నాడు.
భారత జట్టులోకి తిరిగి రావాలంటే గంభీర్ పరుగులు సాధించి, నిరూపించుకోవాలని
అన్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరైన
ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించాడు. తమ సత్తా చాటుకోవడానికి శిఖర్ ధావన్,
మురళీ విజయ్‌కు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ అవకాశం కల్పించిందని ఆయన
అన్నాడు. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే వారిద్దరు
ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో పరుగులు సాధించాలని అన్నాడు.
స్పిన్నర్ హర్భజన్‌కు తిరిగి జట్టులో స్థానం కల్పించడం పట్ల గంగూలీ హర్షం
వ్యక్తం చేశాడు. భజ్జీపై తనకు నమ్మకం ఉందని, అయితే, హర్భజన్‌ను తుది
జట్టులోకి తీసుకుంటారా, లేదా అనేది కెప్టెన్ ధోనీ నిర్ణయం మీద ఆధారపడి
ఉంటుందని ఆయన అన్నాడు.
ganguly supports decision drop gambhir
SC Ganguly
G Gambhir
Profile
Gallery
All India Players
బాగా ఆడనప్పుడు తొలగించడం మామూలేనని, తిరిగి జట్టులోకి వచ్చిన హర్భజన్
సత్తా చాటుకుంటాడనే నమ్మకం తనకు ఉందని అన్నాడు. ఆస్ట్రేలియాపై హర్భజన్
సింగ్ విజయవంతమైన బౌలర్ అని, ఆస్ట్రేలియాపై భజ్జీ 90 వికెట్లు తీశాడని ఆయన
గుర్తు చెశారు.
సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా, ఇండియా - రెండు జట్లు కూడా
ఒత్తిడిలోనే ఉన్నాయని గంగూలీ అన్నాడు. సొంత గడ్డపై ఆడుతుండడం వల్ల ఇండియాకు
మెరుగు అని ఆయన అన్నాడు. ఆస్ట్రేలియాపై జరుగుతున్న సిరీస్‌లో యువకులు
ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని గంగూలీ అన్నాడు.
No comments:
Post a Comment