దుబాయ్: ఐసిసి తాజా ర్యాంకింగ్స్‌లో వన్డే మ్యాచుల్లో భారత క్రికెట్ 
జట్టు తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. సోమవారం ప్రకటించిన ఐసిసి 
ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో 
స్థానాన్ని కాపాడుకున్నాడు.
భారత్ 119 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానం ఇంగ్లాండు 
జట్టుది. వెస్టిండీస్‌పై సిరీస్‌ను 5-0 స్కోరుతో గెలిచిన ఆస్ట్రేలియా తన 
ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. మూడు రేటింగ్ పాయింట్లు సాధించి 116 
పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
బ్యాట్స్‌మెన్ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ 
మొదటి పది ర్యాంకుల్లోకి ఎగబాకాడు. ఆరు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానాన్ని
 దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో 198 పరుగులు సాధించిన 
వాట్సన్ తన వ్యక్తిగత ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌లో 
దక్షిణాఫ్రికాకు చెందిన హషీం ఆమ్లా అగ్రస్థానంలో నిలువగా, కెప్టెన్ ఎబి 
డివిలీర్స్ రెండో స్థానంలో, భారత ఆటగాడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో 
నిలిచారు. 
 
 
 
 icc rankings team india retain no 1 spot odis
    V Kohli
    Yuvraj Singh
    Profile
    Gallery
    All India Players
బౌలర్లలో ఆస్ట్రేలియాకు చెందిన క్లింట్ మెక్‌కే మొదటి సారి తొలి పది 
ర్యాంకుల్లోకి ఎగబాకాడు. వెస్టిండీస్‌పై జరిగిన సిరీస్‌లో ఐదు మ్యాచులు ఆడి
 తొమ్మిది వికెట్లు తీసుకుని తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. అతను ఏడో 
స్థానంలో నిలిచాడు. మిచెల్ జాన్సన్ ఐదు స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో 
నిలిచాడు.
వెస్టిండీస్‌కు చెందిన బౌలర్ సునీల్ నరినే మూడో స్థానానికి ఎకబాకాడు. 
బౌలర్లలో పాకిస్తాన్ ఆటగాళ్లు సయీద్ అజ్మల్, మొహ్మద్ హఫీజ్ మొదటి రెండు 
స్థానాలను నిలబెట్టుకున్నారు. టాప్ టెన్ ఆల్ రౌండర్ల స్థానాల్లో మార్పు 
లేదు. హఫీజ్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, షకీబ్ ఆల్ హసన్, వాట్సన్ రెండు,
 మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
 
No comments:
Post a Comment