 
 
Milestone Beckons Virat Kohli Test Cricket
చెన్నై: ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచుల సందర్బంగా భారత 
క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువ అవుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఈ
 నెల 22వ తేదీన తొలి టెస్టు మ్యాచ్ చెన్నైలో ప్రారంభమవుతున్న విషయం 
తెలిసిందే. టెస్టుల్లో వేయి పరుగుల మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీ
 మరో 109 పరుగులు చేయాల్సి ఉంది.
ఇప్పటి వరకు అనతు 14 టెస్టు మ్యాచులు అడి 38.73 సగటుతో 891 పరుగులు చేశాడు.
 అతను మూడు సెంచరీలు, ఐదు అర్థ సెంచరీలు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన 
మ్యాచుతో 2011లో విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు.
ప్రస్తుతం భారత జట్టులో విరాట్ కోహ్లీ కీలకమైన ఆటగాడు. చెన్నై మ్యాచులోనే 
అతను వేయి పరుగుల మైలు రాయిని చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అతి 
వేగంగా వేయి పరుగుల మైలు రాయిని దాటిన బ్యాట్స్‌మన్ రికార్డు ఇప్పటి వరకు 
వినోద్ కాంబ్లీ పేరు మీద ఉంది. విరాట్ కోహ్లీ 25 ఇన్నింగ్సుల్లో 891 
పరుగులు చేశాడు.
సచిన్ టెండూల్కర్ 19 టెస్టుల్లో 28 ఇన్నింగ్సు ఆడి వేయి పరుగుల మైలు రాయి 
చేరుకున్నాడు. కోహ్లీ వన్డేల్లో 4 వేల పరుగుల మైలురాయి దాటాడు. అతను 13 
సెంచరీలు చేశాడు. అతని సగటు దాదాపు 50 ఉంది.
 
No comments:
Post a Comment