 
             
ముంబై:
 అతిలోక సుందరి శ్రీదేవి, పరిపూర్ణ నటుడు కమల్ హాసన్ జోడీకి ఒకప్పుడు మంచి 
క్రేజ్ ఉండేది. ఎర్ర గులాబీలు మొదలు ఆకలి రాజ్యం, వసంత కోకిల వంటి ఎన్నో 
సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. తమిళంలో అయితే ఇరవైకి సినిమాల్లో 
వీళ్లే హీరో హీరోయిన్లు. హిందీలో సద్మా సినిమా ద్వారా మంచి మార్కులు 
కొట్టేశారు.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ 
వీరిద్దరూ నటించే అవకాశం ఉంది. తామిద్దరం కలిసి నటించేలా కథను తయారు చేసే 
పనిలో కమల్ హాసన్ ఉన్నారని బాలీవుడ్ టాక్. స్వయంగా కమల్ కూడా ఈ విషయం 
ధృవీకరించారు. స్క్రిప్టు పని జరుగుతోందని చెప్పారు. 
 
No comments:
Post a Comment